చిత్తూరి హైమావతి మృతి బాధాకరం: మున్సిపల్ చైర్‌పర్సన్
చిత్తూరి హైమావతి మృతి బాధాకరం: మున్సిపల్ చైర్‌పర్సన్
కోదాడ, ఆంధ్రప్రభ: చిత్తూరి హైమావతి మృతి బాధాకరమని కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమకుమారి వెంకటరత్నబాబు అన్నారు. ఆదివారం కోదాడలోని సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించిన చిత్తూరి హైమావతి పెద్దకర్మ కార్యక్రమంలో ఆమె పాల్గొని హైమావతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ చిత్తూరి హైమావతి ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం హైమావతి కుమారుడు చిత్తూరి శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కనగాల వెంకటరామయ్య, ప్రముఖ వ్యాపారవేత్త తాళ్లూరి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, బాడిశ రామారావు, జర్నలిస్ట్ బాదే రాము, అలీ, కమతం మురళి తదితరులు పాల్గొని హైమావతికి నివాళులర్పించారు.
