మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
రూ.10 లక్షలతో సంఘ భవనాలకు భూమిపూజ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: మహిళా సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హస కొత్తూరు గ్రామ సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి అన్నారు. ఆదివారం కమ్మర్ పల్లి మండలం హస కొత్తూరు గ్రామంలో రెండు మహిళా సంఘాల భవనాలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మహిళల ఆత్మగౌరవం పెంపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
మహిళలను ఐక్యంగా ఉంచేందుకు స్వశక్తి సంఘాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కుందేటి శ్రీనివాస్, కనుక నరసయ్య, కల్లెడ కాశవ్వ, పసుల గంగు, ఐకేపీ సీసీ అలేఖ్య, వివో అధ్యక్షురాలు మంద భాగ్య, విఓఏలు వీణ, సాగారిక, రమ్య, విమల, లయ, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

