అగ్నివీర్‌గా ఎంపికైన తొర్రూరు యువకుడు ఎం. దినేష్
అగ్నివీర్‌గా ఎంపికైన తొర్రూరు యువకుడు ఎం. దినేష్
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ:
తొర్రూరు పట్టణానికి చెందిన యువకుడు ఎం. దినేష్ భారత సైన్యంలో అగ్నివీర్ ఆర్మీ జనరల్ డ్యూటీ పోస్టుకు ఎంపికై పట్టణానికి గర్వకారణంగా నిలిచాడు. దినేష్ తన పాఠశాల విద్యను ఎంజేపీబీసీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, పెద్దవంగరలో పూర్తి చేశాడు. అనంతరం తొర్రూరు పట్టణంలోని సమత జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాడు. విద్యాభ్యాసంతో పాటు మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని విశేష సేవలు అందించాడు.
దేశ సేవే లక్ష్యంగా భారత సైన్యంలో చేరాలని సంకల్పించిన దినేష్, 2025 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన రిక్రూట్మెంట్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో అతను అగ్నివీర్ ఆర్మీ జనరల్ డ్యూటీకి ఎంపికయ్యాడు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దినేష్ భవిష్యత్తులో దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించాలని పలువురు అభినందనలు తెలిపారు.
