CM Revanth | వ్యవసాయ మార్కెట్లకు రండి.. రైతుల కష్టాలు చూడండి
CM Revanth | వ్యవసాయ మార్కెట్లకు రండి.. రైతుల కష్టాలు చూడండి
- కేసముద్రం మార్కెట్ ను సందర్శించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
CM Revanth | కేసముద్రం, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జూబ్లీహిల్స్ ప్యాలెస్ వదిలి వ్యవసాయ మార్కెట్లకు వస్తే రైతులు కష్టాలు తెలుస్తాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ను బీఆర్ఎస్ నేతలు మాలోత్ కవిత, ఎమ్మెల్సి వద్దిరాజు రవిచంద్ర(MLC Vaviraju Ravichandra), మాజీ ఎమ్మెల్యేలు భానోత్ శంకర్ నాయక్, రెడ్యా నాయక్, పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్ కేసముద్రం మార్కెట్ లో ఇవాల్టీకి కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదని అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు నీలం దుర్గేష్, మాజీ జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి(Ravula Srinath Reddy), డాక్టర్ నజీర్ అహ్మద్, కముటం శ్రీనివాస్, జాటోత్ హరీష్ నాయక్, గుగులోత్ వీరు నాయక్, మోడెం రవీందర్ గౌడ్, పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
