బాడీ బిల్డింగ్ క్రీడాకారులతో కోచ్.

బాడీ బిల్డింగ్ క్రీడాకారులతో కోచ్.

రాష్ట్ర స్థాయి పోటీలకు బాడీ బిల్డింగ్ క్రీడాకారుల ఎంపిక

పాయకాపురం, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల17వ తేదీన నిర్వహించనున్న 2వ మిస్టర్ ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్లాసిక్ బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన క్రీడాకారుల ఎంపికలు ఇటీవల విజయవాడలోని సింగ్ నగర్ లోని మనోహర్ జిమ్‌ నందు ఈ నెల 10 వ తేదిన నిర్వహించారు.ఈఎంపిక కార్యక్రమానికి 58వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎర్రబోతు శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.

విజయవాడ సెంట్రల్ మైనారిటీ అధ్యక్షులు గౌస్, కృష్ణా జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి. రవికుమార్, హర్షిత,ఎర్రబోతు రామారావు, ఎర్రబోతు రమణ తదితరులు పాల్గొని, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి ఉమ్మడి జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు.
మంగళవారం ఉదయం కానూరులోని అశోక్ జిమ్‌లో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు బి.మనోహర్, ఉపాధ్యక్షులు సిహెచ్.రాజు ఎంపికైన క్రీడాకారుల వివరాలను వెల్లడించారు.
..ఎంపికైన క్రీడాకారులు..
50–55 కేజీల విభాగం
వి.సురేష్ (ఎన్టీఆర్ జిల్లా), డి.జాషువా (ఎన్టీఆర్ జిల్లా)
..55–60 కేజీల విభాగం..
జి.వాసుదేవ్ (కృష్ణా జిల్లా)
60–65 కేజీల విభాగం..
టి.రవి తేజా (కృష్ణా జిల్లా), బి.దయాకర్, పి.రామకృష్ణ, ఎం.అవినాష్, జి.నిరాజ్ (ఎన్టీఆర్ జిల్లా)
65–70 కేజీల విభాగం
ఏ.శ్రీధర్, పి.సాయి కుమార్, బి.అశోక్ (ఎన్టీఆర్ జిల్లా)
70–75 కేజీల విభాగం
ఆర్.దుర్గ ఆంజనేయులు (ఎన్టీఆర్ జిల్లా), జి.అనురాగ్ ముకేష్ (కృష్ణా జిల్లా), కె.శ్రీరామ్, కె.హరికృష్ణ (ఎన్టీఆర్ జిల్లా)75–80 కేజీల విభాగం
సి.హెచ్.శ్రీకాంత్ (ఎన్టీఆర్ జిల్లా)80–85 కేజీల విభాగం
ఎస్.కే.ఇబ్రహీం (ఎన్టీఆర్ జిల్లా)85 కేజీల విభాగం
ఎస్.కే.రెహన్, సి.హెచ్.గోపీ కృష్ణ (కృష్ణా జిల్లా)ఫిజిక్ స్పోర్ట్స్ విభాగం(165 సెం.మీ. లోపు)
వై.ప్రణయ్ తెజేష్, వి.కిషోర్
(165 సెం.మీ. పైబడిన విభాగం)
టి.రవి తేజా, ఎం.అవినాష్, పి.సాయి కుమార్, వి.సురేష్, జి.అనురాగ్ ముకేష్ ఎంపికయ్యారు.
ఈ జట్టుకు టీమ్ మేనేజర్‌గా ఎం.అల్లూరి శ్రీనివాస్ రెడ్డి (ఏ ఒన్ ప్రోటీన్ హౌస్), టీమ్ కోచ్‌గా ఎస్.కే.ఖాదర్ (ఇండియన్ ఫిజిక్ జిమ్), టీమ్ ఇంచార్జ్‌గా ఎస్.కే.బాషా (రా ఫిట్నెస్ జిమ్) వ్యవహరిస్తారని ఉమ్మడి జిల్లాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి అశోక్బి తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్, ఇంచార్జ్‌లకు ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అసోసియేషన్ చైర్మన్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ క్రీడాభినందనలు తెలిపారు.