PBKS vs DC | పంజాబ్ పై టాస్ నెగ్గిన‌ ఢిల్లీ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడుతున్నాయి. కాగా, నేటి మ్యాచ్ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఇదిలా ఉండ‌గా, సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీనితో, పంజాబ్ జట్టు ముందుగా తమ బ్యాటింగ్ శక్తిని చూపించాల్సి ఉంటుంది.

తుది జ‌ట్లు !

ఢిల్లీ క్యాపిటల్స్ : ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ (వికెట్ కీప‌ర్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీస్ (వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.

Leave a Reply