RISHAB PANTH | రెండో ప్లేయర్​గా పంత్ రికార్డ్

  • భారత్- సౌతాఫ్రికా రెండో టెస్టుకు కెప్టెన్‌గా పంత్
  • ధోనీ తర్వాత ఆ ఘనత సాధించిన ప్లేయర్​గా రికార్డ్

RISHAB PANTH | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : గువాహటి వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు జ‌రుగుతోంది. రెగ్యుల‌ర్ కెప్టెన్ గిల్ గాయ‌ప‌డ‌టంతో ఈ టెస్టుకు దూర‌మ‌య్యాడు. ఆయ‌న ప్లేస్‌లో కెప్టెన్​గా పంత్ వ్యవహరిస్తున్నాడు. భారత్​కు టెస్టుల్లో సారథ్యం వహించిన 38వ కెప్టెన్​గా నిలిచాడు. దీంతో పంత్‌ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో భారత్ జట్టుకు సారథ్యం వహించిన రెండో వికెట్ కీపర్, బ్యాటర్​గా నిలిచాడు. పంత్ కంటే ముందు మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే (వికెట్ కీపర్, బ్యాటర్) టీమ్ఇండియాను టెస్టుల్లో నడిపించాడు. 100ఏళ్ల చరిత్ర ఉన్న భారత టెస్టు జట్టుకు ఈ ఇద్దరు వికెట్ కీపర్లే కెప్టెన్సీ వహించిన ఘనత అందుకున్నారు.

కెప్టెన్​గా ఎంపిక కావ‌డంపై పంత్ మాట్లాడాడు. ఇది తనకు ఓ గౌరవం అని చెప్పాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు అని చెప్పాడు. కొన్నిసార్లు సంప్రదాయబద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం బాగుంటుంద‌ని, మరికొన్నిసార్లు కొత్తగా ట్రై చేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చ‌న్నారు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం తెలిసి ఉండాల‌న్నారు. ఆటను ఆస్వాదిస్తూ జట్టు కోసం నేను చేయాల్సింది వంద శాతం చేస్తాన‌ని పంత్ పేర్కొన్నాడు.

Leave a Reply