మహిళలు, యువతకు ‘శక్తి’ యాప్‌పై అవగాహన

బాపట్ల, ఆంధ్రప్రభ: మహిళలు, యువత భద్రత కోసం బాపట్ల జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు శక్తి బృందాలు జిల్లాలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పర్యటించి మహిళలు, యువతకు ‘శక్తి’ యాప్‌పై అవగాహన కల్పించాయి.

మహిళలు, యువత అత్యవసర పరిస్థితుల్లో యాప్‌ను ఎలా ఉపయోగించుకోవాలి.. పోలీసుల సహాయం ఎలా పొందాలనే అంశాలపై శక్తి బృందాలు వివరించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా మహిళలు, యువత భద్రతపై అవగాహన పెంచే కార్యక్రమాలను కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.