12న ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి మహోత్సవం..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణంలోని ఉరగాద్రి శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 12న ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్‌ కొత్త శరత్‌ తెలిపారు. ఆదివారం జయంతి మహోత్సవానికి సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ కొత్త శరత్‌ మాట్లాడుతూ.. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. మహోత్సవంలో భాగంగా మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కొత్త సోమశేఖర్‌, లక్క ఎర్రిస్వామి, ఉట్టి ధనంజయ, ఉట్టి నారాయణ, పూజారి ప్రసాద్‌, నాగరాజు, ఆర్‌.సి. ప్రసాద్‌, రెడ్డి అంజి, చిట్టా రఘు, రామన్న తదితరులు పాల్గొన్నారు.