FromOct1 | రికవరీ ఏజెంట్ల వేధింపులపై కఠిన చర్యలు

FromOct1 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : బ్యాంకు రుణగ్రహీతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఊరట నిచ్చింది. లోన్ రికవరీ పేరుతో కస్టమర్లను వేధిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆర్‌బీఐ కొత్త డ్రాఫ్ట్ నిబంధనలు విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రికవరీ ఏజెంట్ల ద్వారా కస్టమర్లపై ఒత్తిడి తెస్తున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రుణ వసూళ్ల పేరుతో బెదిరింపులు, అసభ్య ప్రవర్తన, వ్యక్తిగత వేధింపులు చేయడం పూర్తిగా నిషేధిస్తామని స్పష్టం చేసింది.

కొత్త మార్గదర్శకాలను ఉల్లంఘించిన బ్యాంకులు, రికవరీ ఏజెంట్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణగ్రహీతల హక్కులను రక్షించడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడమే ఈ నిర్ణయాల లక్ష్యమని తెలిపింది.

Leave a Reply