Operation Kagar | లొంగిపోయిన 108మంది మావోయిస్టులు

Operation Kagar | లొంగిపోయిన 108మంది మావోయిస్టులు
Operation Kagar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని జగదల్‌పూర్‌లో ఇవాళ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, కీలక నేతల సరెండర్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ. వీరితో పాటు భారీగా ఆయుధాల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
