ఐదవ రోజు అట్ల బతుకమ్మ !!

తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు సాగే బ‌తుక‌మ్మ‌ ఉత్సవాలు ప్రతీ వీధిలో, ప్రతీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని నింపుతాయి. ఈ పండుగ ప్రకృతి, మహిళా శక్తి, సమాజ బంధాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. ఆడపడుచులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ ప్రారంభమైంది. ఇప్పటికే నాలుగు రోజుల వేడుకలు పూర్తయ్యాయి.

  • ఎంగిలిపూల బతుకమ్మ: మొదటి రోజు పూలను ఏరి, నీటిలో తడపకుండా, వాటిని ఎంగిలి చేయకుండా బతుకమ్మను పేర్చుతారు.
  • అటుకుల బతుకమ్మ: రెండవ రోజు అటుకులను బెల్లం, నెయ్యితో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
  • ముద్దపప్పు బతుకమ్మ: మూడవ రోజు పెసరపప్పుతో చేసిన నైవేద్యం పెడతారు.
  • నానబియ్యం బతుకమ్మ: నాలుగవ రోజు నానబెట్టిన బియ్యం, బెల్లం కలిపి సమర్పిస్తారు.

ఇక ఐద‌వ రోజు అట్ల బతుకమ్మ: ఐదవ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఈరోజు బతుకమ్మను ఐదు వరుసలలో పేర్చి, పిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఇక‌ సాయంత్రం మహిళలందరూ బతుకమ్మ చుట్టూ చేరి, చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడి, నృత్యాలు చేస్తారు. ఆ తర్వాత బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా నీటిలో నిమజ్జనం చేసి, ఆ రోజు చేసిన ప్రసాదాన్ని అందరూ కలిసి పంచుకుంటారు.

Leave a Reply