జీవో నెంబర్ 77పై… జీర్ణించుకోలేని మనస్తత్వం…
కూటమి, వైసీపీ అధినేతలది.
ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్
పాయకాపురం, ఆగస్టు 11(ఆంధ్ర ప్రభ ) : రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకువచ్చి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కృషి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు జీవో నెంబర్ 77 తీసుకువచ్చి నాటి వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత చదువుల ఆశలను అవకాశాలను హత్య చేస్తే నేటి కూటమి ప్రభుత్వంలోని టిడిపి, జనసేన, బిజెపిలు గుంత తీసి పూడ్చిపెట్టాయని ఆయన మండిపడ్డారు.
జీవో నెంబర్ 77 పై వైసీపీ, కూటమి ప్రభుత్వాల కుట్రపూరిత వైఖరి దుర్మార్గమైనదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద విద్యార్థుల ఉన్నత చదువులను జీర్ణించుకోలేక జీవో నెంబర్ 77ను వైసీపీ ప్రభుత్వం తీసుకువస్తే దానిని కూటమిలోనే టిడిపి జనసేన బిజెపి పార్టీల అగ్రవర్ణ అధినేతలు అమలుపరచడం చూస్తుంటే వారి జీర్ణించుకోలేని మనస్తత్వానికి నిదర్శనని అన్నారు.
