చాగంటి చిన్నా సేవలు ఆదర్శనీయం..

  • ఆపదలో అండగా.. చాగంటి చిన్నా చేయూత

నర్సాపురం, ఆంధ్రప్రభ: కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్న జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌, చాగంటి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ చాగంటి మురళీకృష్ణ (చిన్నా) సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. పేదలకు అండగా నిలుస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి తనవంతు సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

పేద కుటుంబాలకే కాకుండా జనసైనికులు, వీర మహిళలు కష్టాల్లో ఉన్న సమయంలోనూ చాగంటి చిన్నా అండగా నిలుస్తున్నారు. పాలకొల్లు జనసేన పార్టీ వీర మహిళ, పాలకొల్లు చినగోపురం ట్రస్ట్‌ చైర్మన్‌ గాజుల పద్మ భర్త వాసుదేవరావు ఇటీవల ప్రమాదానికి గురై పాలకొల్లులోని సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న చాగంటి చిన్నా మంగళవారం ఆసుపత్రికి వెళ్లి వాసుదేవరావును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వైద్య ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్నవారికి తనవంతు సహాయం చేయడం ద్వారా చాగంటి చిన్నా ఉదారతను చాటుకున్నారని పలువురు అభినందించారు. పేద కుటుంబాలతో పాటు జనసైనికులు, వీర మహిళలకు కూడా ఆయన అందిస్తున్న సహాయ సహకారాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాగంటి చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, అభిమానులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.