Toxic | యష్ ఫ్యాన్స్‌కు పండగే!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: కన్నడ నటుడు రాక్‌స్టార్ యష్ నటిస్తున్న భారీ అంచనాల చిత్రం ‘టాక్సిక్’ మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాను ఐమ్యాక్స్‌ ఫార్మెట్‌ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం బిగ్‌ స్ర్ర్కీన్‌ పై ప్రేక్షకులకు బిగ్‌ ట్రీట్‌ కానుంది.

భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, కథా ప్రపంచాన్ని పెద్ద తెరపై మరింత ప్రభావవంతంగా చూపించేందుకు ఆగస్టు 26న సిద్దం కావల్సిందే. ట్రైలర్‌ లో యాష్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యష్‌ సరసన నయనతారా, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శ్తకత్వం వహిస్తున్నారు.

‘టాక్సిక్’లో యష్ సరికొత్త పాత్రలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ట్రైలర్ అప్‌డేట్స్‌పై సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కాగా ఈ సినిమా ఆగస్టు 26 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యష్ అభిమానులకు ప్రత్యేకమైన సినిమా అనుభూతిని అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఈ భారీ స్థాయి విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది.