ఇబ్రహీంపట్నంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలో కూటమి నాయకులు మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ మెయిన్ గేటు నుంచి ప్రారంభమైన ర్యాలీ రింగ్ కూడలి వరకు సాగింది. ర్యాలీలో కూటమి నాయకులు ముందు వరుసలో నిలువగా, బ్రిలియంట్స్ హైస్కూల్ విద్యార్థులు త్రివర్ణ పతాకాలు చేతపట్టి జాతీయ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామమోహనరావు (గాంధీ), బీజేపీ సీనియర్ నేత నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల), కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రేగళ్ల రఘునాథ రెడ్డి, బీజేపీ కొండపల్లి పట్టణ అధ్యక్షురాలు తమ్మినేని మాధురి, ప్రధాన కార్యదర్శులు దాము భవాని, సేనాపతి నాగమణి, కూనాల యుగంధర్, వల్లెం కృష్ణకుమారి, నరసింహారావు, జనసేన పార్టీ కొండపల్లి పట్టణ అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్, మారాసు కృష్ణ మోహన్, తుమ్మల శ్రీ కుమార్, కరుకుమల్లి సత్యవతి, తిరుపతి నాయుడు, పయ్యావుల రాము తదితరులు పాల్గొన్నారు.
