Number 1 Coolie : తలకు తువ్వాలుతో.. Andhra Prabha Top Story

Number 1 Coolie : తలకు తువ్వాలుతో.. Andhra Prabha Top Story

  • చేత పార పట్టి
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్​ ప్రత్యక్షం
  • కూలీలతో కలసి అల్పాహారం
  • ఉపాధి పనుల్లో ​ మమేకం

(ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం )

Number 1 Coolie

Number 1 Coolie : తలకు తువ్వాలు చుట్టి చేత పారపట్టి తాను సైతం శ్రామికుడినేనని.. శ్రమదైక పైందర్యానికి ఎన్టీఆర్​ జిల్లా కలెక్టర్​ లక్ష్మీశ అద్దం పట్టారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని సీతాకోక చిలుకల (బటర్ ఫ్లై) పార్క్‌ను ఎన్టీఆర్​ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు.

Number 1 Coolie

అధికారులతో కలిసి పార్క్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా కొనసాగుతున్న చెరువుల పూడికతీత, నీటి కాలువల ప్రక్షాళన పనులను సమీక్షించారు.

Number 1 Coolie

పర్యావరణ పరిరక్షణతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే సంవత్సర కాలంలో ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పునరుద్ధరణకు చేపడుతున్న పనులు భవిష్యత్ తరాలకు మేలు చేకూరుస్తాయని అన్నారు.

Number 1 Coolie : తలకు పాగా చుట్టి… చేత పార పట్టి..

Number 1 Coolie

ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలతో కలెక్టర్ మమేకమయ్యారు. కూలీలతో కలిసి అల్పాహారం చేసిన ఆయన , తలకు తువ్వాలు చుట్టుకుని స్వయంగా పార పట్టి పనుల్లో పాల్గొనడం ఆకట్టుకుంది.

Number 1 Coolie

కలెక్టర్ సాదాసీదా వ్యవహార శైలి కూలీలలో ఉత్సాహాన్ని నింపింది. జూన్ 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. మూలపాడులో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. విస్తృత స్థాయిలో మొక్కల నాటకం, పర్యావరణ అవగాహన ర్యాలీలు, నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Number 1 Coolie
Number 1 Coolie

ALSO READ :82.22 Crore Jaladhara : బీడు భూముల్లో జలధార Andhra Prabha Top Story

Leave a Reply