82.22 Crore Jaladhara : బీడు భూముల్లో జలధార Andhra Prabha Top Story

82.22 Crore Jaladhara : బీడు భూముల్లో జలధార Andhra Prabha Top Story

  • జలహారతితో నీటి వనరులకు పునర్జీవం…
  • రైతులలో సాగునీటి ఆశలు….
  • ₹ 82.22 కోట్లతో 1929 జలసంరక్షణ పనులు..

( ఆంధ్ర ప్రభ, ఏలూరు బ్యూరో)

జలధార-జలహారతి కార్యక్రమం నిజంగా ఏలూరు జిల్లాలోని రైతుల పాలిట వరమైంది ప్రభుత్వం చేపట్టిన కాల్వ పునరుద్ధరణతో వర్షం నీటి నిల్వ సామర్థ్యం పెరగనుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో మాకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందంలో ఉన్నారు. వర్షం నీరు భద్రం చేయడం, భూగర్భ జలాలు పెరగడం, ఎన్నడు అందని చివరి భూములకు సాగునీరు అందించే అవకాశం ఉందని ప్రభుత్వానికి రైతులు తమ కృతఙ్ఞతలు తెలిపారు.

82.22 Crore Jaladhara : ఊరూర జలధార

ఏలూరు జిల్లాలో “జలధార జలహారతి” కార్యక్రమంతో పంట కాల్వలు, చెరువులు, ఫీడర్ చానెల్స్ వంటి నీటి వనరులు పునర్జీవం పోసుకుంటున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. దీంతో అడుగంటిన భూగర్భ జలాలు పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ పనులతో కురిసిన ప్రతీ నీటి చుక్కని ఒడిసిపట్టాలని, జిల్లాలో చెరువులు, కాల్వలలో నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలన్న జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాలతో అధికారులు జలధార-జలహారతి కార్యక్రమాన్ని చేపట్టారు. వెనువెంటనే డ్వామా, జలవనరుల శాఖల అధికారులు 100 రోజుల సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలులోకి తీసుకువచ్చారు. జిల్లాలో రూ. 82. 22 కోట్లతో 1929 పనులు చేపట్టారు. సాగునీటి సంఘాల సహకారంతో చెరువులు, కాల్వల మరమ్మతులు, పూడికతీత పనులను చేపట్టారు. జలధార జలహారతితో ఫీడర్ కాల్వలు జల కళను సంతరించు కోనున్నాయి. భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

82.22 Crore Jaladhara : ఆగిరిపల్లిలో…

అగిరిపల్లి మండలం బొద్దనపల్లిలోని మైనర్ ఇరిగేషన్ చెరువు పూడికతీసి నీటినిల్వ సామర్ధ్యాన్ని పెంచారు. ఇందుకోసం ఉపాధిహామీ కూలీలకు 1981 దినాలు కల్పించి 5 లక్షల 71 వేల 552 రూపాయలను వేతనంగా చెల్లించారు. పనులు పూర్తి ఐన అనంతరం మంచినీటి చెరువు సిద్ధమైంది.

82.22 Crore Jaladhara : దెందులూరులో…

దెందులూరు మండలం గాలయగూడెం లోని ఫీడర్ ఛానల్ కు మరమ్మత్తులు చేసి, ముళ్ల చెట్లు తీసివేసి, నీటిపారుదల అనువుగా చేశారు. ఇందుకు ఉపాధి హామీ కూలీలకు 852పనిదినాలు కల్పించి 2 లక్షల 31 వేల 478 రూపాయలు వేతనంగా చెల్లించారు. ఈ పనులతో తమ గ్రామానికి మేలు జరుగుతుందని తెలుసుకున్న గ్రామస్థులు తాము సైతం జలధార పనులలో భాగస్వాములయ్యారు.

82.22 Crore Jaladhara : కామవరపు కోటలో..

కామవరపుకోట మండలం ఉప్పలపాడు లోని ఫీడర్ ఛానల్ కు మరమ్మత్తులు చేసి, ముళ్ల చెట్లు తీసివేసి, నీటిపారుదల అనువుగా చేశారు. ఇందుకు ఉపాధి హామీ కూలీలకు 1083 పనిదినాలు కల్పించి 122486 లక్షా 22 వేల 486 రూపాయలు వేతనంగా చెల్లించారు. ఈ పనులలో స్థానిక గ్రామస్తులు పాలు పంచుకున్నారు.

82.22 Crore Jaladhara : ముసునూరులో…

ముసునూరు మండలంలోని లోపూడి గ్రామంలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ పూడికతీసి నీటినిల్వ సామర్ధ్యాన్ని పెంచారు. ఇందుకోసం ఉపాధిహామీ కూలీలకు 2036 దినాలు కల్పించి 6 లక్షల 25 వేల 163 రూపాయలను వేతనంగా చెల్లించారు. పనులు పూర్తి ఐన అనంతరం నీటి నిల్వ సామర్ధ్యం పెంచుకుని మంచినీటి చెరువు సిద్ధమైంది.

Leave a Reply