Crime | మస్తాన్ హార్డ్ డిస్క్ లో న్యూడ్ వీడియోలు… అరెస్ట్ తో వెల్లడైన నిజాలు

ప్రముఖ నటి లావణ్య, రాజ్ తరుణ్ కేసు విషయంలో కీలక అప్‌డేట్ వచ్చింది. మస్తాన్ సాయిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని లావణ్య తన ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం, మస్తాన్ సాయి వివిధ అమ్మాయిలతో సన్నిహితంగా ఉండగా, వారి వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేశాడని తెలిపింది. ఆ వీడియోలను ఉపయోగిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ, సాయి వారిని ఆందోళనకు గురిచేసేవాడని ఆమె వెల్లడించింది. ఈ క్రమంలోనే మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది.

మస్తాన్ సాయిపై ఆరోపణలు…
మస్తాన్ సాయి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ క్రమంలో ఏపీ పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఆయనపై లావణ్య ఆరోపణలు పెరిగిన తర్వాత, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను అతడు రికార్డ్ చేశాడని, ఆ వీడియోలను ఉపయోగించి మస్తాన్ సాయి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు.

వీరి వీడియోలు సైతం…
అంతేకాదు హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేటు వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్కులో ఉన్నట్లు లావణ్య తెలిపింది. మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి హార్డ్ డిస్క్‌ను తీసుకొచ్చినట్లు లావణ్య వెల్లడించింది. అందులో వందలాది మంది నగ్న వీడియోలు ఉన్నాయంది. ట్రాప్ అయిన అమ్మాయిలకు మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడేవారని చెప్పింది. యువతులు మత్తులో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వారిపై లైంగిక దాడి చేసి వీడియోలను తీసేవాడని లావణ్య చెప్పుకొచ్చింది.

హీరో నిఖిల్ ఫోన్ కూడా…
ఆ క్రమంలోనే లావణ్య వీడియోలు సైతం మస్తాన్ సాయి తీసినట్లు తెలిపింది. లావణ్య బట్టలు మార్చుకునే సమయంలో స్పై కెమెరాలు పెట్టి మస్తాన్ సాయి చిత్రీకరించిన వీడియోలు ఉన్నట్లు పేర్కొంది. దీంతోపాటు లావణ్య మాట్లాడుతున్న వీడియో కాల్స్, ప్రైవేట్ వీడియోలు 40కి పైగా ఉన్నట్లు లావణ్య వెల్లడించింది. ఆ క్రమంలో బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చాలంటూ పలుమార్లు అనేక మందిపై మస్తాన్ సాయి లైంగిక దాడికి పాల్పడేవాడని చెప్పింది. అంతేకాదు హీరో నిఖిల్ ఫోన్ కూడా హ్యాక్ చేసినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మస్తాన్ సాయి చేతిలో మోసపోయిన బాధితులు ప్రస్తుతం భయాందోళన చెందుతున్నారు.

పోలీసుల విచారణ…
అయితే అసలు ఆ 200 వీడియోలలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోల ద్వారా ఇంకా ఎంత మంది వెలుగులోకి వస్తారు, మస్తాన్ సాయి ఇంకా ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేశారనేది తెలియనుంది. మస్తాన్ సాయి గతంలో కూడా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిపై విచారణ చేపట్టారు. అతనిపై మోసం, బ్లాక్‌మెయిల్‌ వంటి ఇతర నేరాలు చేర్చే అవకాశం ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *