మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం
- స్థానికులు చూసి వృద్ధుడికి దేహశుద్ధి పోలీస్ స్టేషన్ తరలింపు
- పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలో మైనర్ బాలిక పై వృద్ధుడు అత్యాచార యత్నం చేసిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం బాలిక ఇంటి పక్కన నివాసం ఉంటున్న వృద్ధుడు ఫోన్ ఇస్తానని మాయ మాటలు చెప్పి తన ఇంట్లోని బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం ప్రయత్నించగా బాలిక భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి వృద్ధుడికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులు అప్పగించారు. జరిగిన సంఘటనపై స్థానిక ఎస్సై అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
