Nizampet | కంటతడి పెట్టిన మహిళ..

Nizampet | కంటతడి పెట్టిన మహిళ..

నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో స్థానిక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ ఓడిపోయారు. దీంతో గ్రామానికి చెందిన దుబ్బవ్వ బుధవారం అతడిని పరామర్శించి కన్నీటి పర్వంతమయ్యారు. గ్రామ యువకుడు గెలిచినట్లయితే గ్రామాభివృద్ధికి సహకరించేవాడని గ్రామ ప్రజలంతా మాట ఇచ్చి ఓడించడం బాధాకరమన్నారు. ఓటర్లు కూడా డబ్బులకు ఆశ పడి మంచి వ్యక్తిని గెలిపించుకోలేకపోయామంటూ బాధపడ్డారు.