మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం ఖాయం

మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం ఖాయం
- 12 వార్డు కౌన్సిలర్లు మాకే.. చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ పదవులు సైతం మాకే
- ధీమా వ్యక్తం చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మోత్కూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ 12 కౌన్సిలర్ స్థానాల్లో నూటికి నూరు శాతం గెలుపొంది, మోత్కూర్ మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని చైర్మన్ ,వైస్ చైర్మన్ తో పాటు కో ఆప్షన్ పదవులు సైతం పొందడం ఖాయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ మోత్కూర్ లో గత బి ఆర్ ఎస్ 10 ఏండ్ల పాలనలో అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు.
రూ.28 కోట్లతో మోత్కూర్ లో మెయిన్ రోడ్డు ,కల్వర్టు బాక్స్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం రూ.15 కోట్లకు సంబంధించిన పనుల టెండర్లు పూర్తి చేసి ఆయా వార్డులలో కాలికి మట్టి అంటకుండా సీసీ రోడ్లు,డ్రైనేజీల నిర్మాణం చేపడుతామన్నారు.మున్సిపాలిటీ లో 169 ఇండ్లు తొలి విడత లో మంజూరు కాగా..మరో 300 ఇండ్లు అదనంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.వచ్చే సంవత్సరం నియోజకవర్గంలో రెండవ దశలో 3500 ఇండ్ల మంజూరు కోసం మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
జామచెట్లబావి,జటంగి బావి గ్రామాలకు బి టి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి,ప్రస్తుతం పనులు సైతం ప్రారంభం అయ్యాయని,15 రోజుల్లో బి టి రోడ్డు పనులు సైతం పూర్తి చేస్తామన్నారు.5 వ వార్డులో పొత్తు లో భాగంగా సీపీఐ అభ్యర్ధిని గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మోత్కూర్ లో అన్ని కాలని ల డ్రైనేజీ వాటర్ పెద్ద చెరువులో కలవకుండా శుద్దీకరణ చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు.ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి ని కాంక్షించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు చెయ్యి గుర్తు పై ఓటేసి 12 మంది కౌన్సిలర్ అభ్యర్థులను మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు డా గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు, సింగిల్ విండో మాజీ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,చింతల విజయ భాస్కర్ రెడ్డి,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యానాల దామోదర్ రెడ్డి, చేడే చంద్రయ్య,అన్నెపు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
