NEWS@12:00 P.M | 13 జూలై 2026 ముఖ్యాంశాలు

Nirmal | మహిళా సర్పంచ్ ఆత్మ‌హ‌త్య‌..!

నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తానూరు మండలం బోరిగావ్ గ్రామ సర్పంచ్ పల్లె జ్యోతి ఇవాళ‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Shabad | హంత‌కుడు రాజ్‌కుమార్ ఆచూకీ లభ్యం..?

తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ షాబాద్ బహుళ హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ లభించినట్లు సమాచారం. అతడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలిసింది.

ఈ సమాచారంతో హైదరాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు సమాచారం. అనంతరం రాజ్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు హుటాహుటిన సూర్యాపేటకు బయల్దేరాయి.

Sensex Crash | 600 పాయింట్లు డౌన్..!

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

ఉదయం ప్రారంభ‌ సమయానికి సెన్సెక్స్ 605 పాయింట్లు క్షీణించి 76,964 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పడిపోయి 24,029 వద్ద ట్రేడవుతున్నాయి.

Jammu Kashmir | రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదు..

జమ్మూకశ్మీర్‌లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. బారాముల్లా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదవడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది.

అధికారుల వివరాల ప్రకారం, బారాముల్లా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌కు ఉత్తర-ఈశాన్య దిశలో సుమారు 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమైనట్లు తెలిపారు.

తెలంగాణలో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి!

తెలంగాణలో జులై నెలలోనూ ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా ఈ కాలంలో వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. జులై రెండో వారంలోనూ సాధారణం కంటే సుమారు 3.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పగటి వేళల్లో ఎండ తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

CLICK HERE TO READ THE FULL STORY