BJP | రాజ్యసభకు నితిన్ నబీన్ నామినేట్

BJP | రాజ్యసభకు నితిన్ నబీన్ నామినేట్
BJP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన 9 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను బీహార్ నుంచి నామినేట్ చేయడం ఈ జాబితాలో హైలైట్‌గా నిలిచింది.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ ఇన్నాళ్లూ బిహార్ లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
బీహార్‌లో నితిన్ నబీన్‌తో పాటు శివేశ్ కుమార్ రామ్ కూడా పోటీ చేయనున్నారు.
అస్సాం నుంచి జోగెన్ మోహన్, తేరాష్ గోవాలా
హర్యానా నుంచి సంజయ్ భాటియా
ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ
ఒడిశా నుంచి మన్మోహన్ సమల్, సుజీత్ కుమార్
పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
రాజ్యసభ ఎన్నికలు మార్చి 16న జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఈ అభ్యర్థుల జాబితా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.
