TG | రేపు సీఎం రేవంత్‌ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం !

తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం రేపు ఉద‌యం 11 గంటలకు జరగనుంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రంలో… సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్ కీలక చర్చలు జరపనున్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి ప్రధాన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పల్లె, పట్టణ స్థాయిలో కాంగ్రెస్ బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను రేవంత్ వెల్లడించనున్నారు. పార్టీ గెలుపుకు అవసరమైన చర్యలను అమలు చేయడం కోసం ఎమ్మెల్యేలకు ప్రత్యేక సూచనలు అందించనున్నారు.

ఇక రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలు, పాలనా వ్యూహాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హాజరుకానున్నారు. సమావేశం అనంతరం సీఎల్పీ నేతలు మీడియా ద్వారా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

Leave a Reply