సేవాలాల్ జగదాంబ 15వ వార్షికోత్సవంలో నేతలు…
సేవాలాల్ జగదాంబ 15వ వార్షికోత్సవంలో నేతలు…
నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి మండల పరిధిలోని పెద్దతండాలో నిర్వహించిన సేవలాల్ జగదాంబ అమ్మవారి 15వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్దతండా సర్పంచి భర్త ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పిటిసి బానపురం కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి భూపతి రాజు, సిద్ధు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి బానపురం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సేవలాల్ జగదాంబ అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుఖశాంతులతో, సమృద్ధిగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.
