Hospital | చిన్నపిల్లల వైద్యాధికారి నిర్లక్ష్యంతో చిన్నారి మృతి..
Hospital | చిన్నపిల్లల వైద్యాధికారి నిర్లక్ష్యంతో చిన్నారి మృతి..
- స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
- కేజీ రోడ్డు ప్రదన రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపిన కుటుంబ సభ్యులు
Hospital | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని అనసూయ హాస్పిటల్ లో డాక్టర్ శ్రీనివాసరెడ్డి నిర్లక్ష్యం వల్ల చిన్నారీ మృతి చెందింది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల మేరకు మూడు రోజుల క్రితం దగ్గు ఆయాసం వస్తుందని పట్టణంలోని అనసూయ హాస్పిటల్ చిన్నపిల్లల డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని, మూడు రోజులైనా శిశువు ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో డాక్టర్ను ప్రశ్నించగా కర్నూలులో చేసే వైద్యం అయినా, నేను చేసే వైద్యమైనా ఒకటేనని మీ పిల్లవాణ్ణి సురక్షితంగా ఇంటికి పంపిస్తానని డాక్టర్ చెప్పడంతో కర్నూలుకు వెళ్లకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేయించామని, రేపు సాయంత్రం డిశ్చార్జ్ ఇస్తానని చెప్పి ఏవో మూడు ఇంజక్షన్లు చేశాడని అప్పటినుంచి పిల్లోడు నల్లగా అయిపోయాడని ఎలాంటి రిపోర్టులు గాని సమాచారం గాని తమకు ఇవ్వకుండానే మొత్తం వైద్య పరీక్షలు చేశాడని తీరా చూస్తే పిల్లల పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్ను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి శిశువును కర్నూలు ప్రభుత్వ కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగిందని అక్కడి డాక్టర్లు పిల్లోనికి వైద్య పరీక్షలు చేసి చనిపోయి రెండు గంటలు అవుతుందని చెప్పారని బంధువులు తెలిపారు. 12 సంవత్సరాల తర్వాత కలిగిన బిడ్డని ఇద్దరు అన్నదమ్ములకు ఒక్కడే కొడుకుని ఎంతో అల్లారూ ముద్దుగా పెంచుకుంటుంటే ఇలా జరిగిందని. మా బాబు చావుకు డాక్టర్ నిర్లక్ష్యమే కారణమనీ శిశువు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

శిశువు పెదనాన్న మాట్లాడుతూ హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి అడుగుతున్నామని అబ్బాయి పరిస్థితి సీరియస్ గా ఉంటే చెప్పండి సార్ కర్నూలుకు వెళ్తాం అని అడిగామని కానీ డాక్టర్ చెప్పిన సమాధానం కర్నూలులో వైద్యమైన నందికొట్కూరులో వైద్యమైన ఒకటైనని భయపడాల్సిన అవసరం లేదని చెప్పి చివరికి మా బాబు చావుకు కారణమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 12 ఏళ్ల తర్వాత కలిగిన బిడ్డ కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. సిపిఎం నాయకుడు నాగేశ్వరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా అనసూయ హాస్పిటల్ ను సీజ్ చేసి డాక్టర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని శిశువు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.. అనంతరం చిన్నపిల్ల వైద్య హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు మృతి దేహంతో నిరసన తెలిపారు

