Nandyala | సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం

Nandyala | సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
- ఘనంగా మువ్వ పూజ మహోత్సవ ఈ కార్యక్రమం..
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవడంలో మనమందరము ముందు ఉండాల్సిన అవసరం ఉందని, నేడు అమ్మాయిలే ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టటం హర్షదాయకమని కళాక్షేత్రం నాట్య గురువు డైరెక్టర్ డాక్టర్ పల్లంశెట్టి సురేష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పాములేటి స్వామి ఆశ్రమంలో పటిక లింగ స్వామి దేవాలయంలో శ్రీ సాయి నాట్యాంజలి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో మువ్వ పూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాక్షేత్రం నాట్య గురువు ఆధ్వర్యంలో మువ్వ పూజ మహోత్సవం కన్నుల విందుగా జరిగింది.
నాట్యం నేర్చుకోవడానికి వచ్చిన చిన్నారులకు కళాక్షేత్రం డైరెక్టర్ గజ్జకట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో కూచిపూడి నాట్యం, భరతనాట్యం, జానపద నాట్యం మొదలగు కళలను నేర్చుకోవడానికి ఆసక్తిగా దాదాపు 300మంది అమ్మాయిలు తల్లిదండ్రులు పాల్గొన్నారు, నంద్యాల ప్రాంతంలో సనాతన హైందవ ధర్మాన్ని కాపాడ్డానికి అమ్మాయిలు ముందుకు వచ్చి నాట్యాన్ని నేర్చుకోవడానికి ఈరోజు మువ్వ పూజ మహోత్సవంలో తల్లిదండ్రులు అధిక సంఖ్యలో అమ్మాయిలు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నాట్య గురువు ఏర్పాటు చేసినందుకు తల్లిదండ్రులు మరియు చూడ్డానికి వచ్చిన ప్రజలు పాల్గొని ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సహకారంతో సనాతన హైందవ ధర్మాన్ని నేటి యువత ఆదరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
