HYD | మధురానగర్ అపార్ట్ మెంట్ లో అగ్నిప్ర‌మాదం

హైదరాబాద్‌: నగరంలోని మధురానగర్‌లో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌లోని సెకండ్‌ ఫ్లోర్‌లో ఏసీ కంప్రెషర్‌లు పేలాయి. దీంతో మంటలు చెలరేగడంతో భవనంలోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

Leave a Reply