Mumbai | రిహాన్నా గ్రాండ్ వెల్‌కమ్‌

Mumbai | రిహాన్నా గ్రాండ్ వెల్‌కమ్‌

Mumbai |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పాప్ స్టార్ రిహన్నా తన ప్రసిద్ధ బ్యూటీ బ్రాండ్ ‘ఫెంటీ బ్యూటీ’ ప్రమోషన్ కోసం ముంబైకి విచ్చేసింది. ఈ ప్రత్యేక ఈవెంట్‌కు ఆమె హాజరయ్యారు. రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యంతో, ఈ కార్యక్రమం ద్వారా ఫెంటీ బ్యూటీ ఉత్పత్తులు భారతదేశంలో (తీరా, సెఫోరా స్టోర్లలో) అందుబాటులోకి వచ్చాయి. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో రిహన్నా ట్రెండీ డ్రెస్సులతో, మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఆభరణాలతో సందడి చేశారు. ఈ సంద‌ర్భంగా పాప్ సింగ‌ర్ రిహ‌న్నా ఇవాళ బిల‌య‌నీర్ ముకేశ్ అంబానీ ఇంటికి వెళ్లారు. వారి ఫ్యామిలీ ఆహ్వానం మేర‌కు త‌న టీమ్‌తో క‌లిసి అంబానీ హౌజ్ ఆంటిటియాకు చేరుకున్నారు. ఆమెకు అంబానీ కూతురు ఈషా, కొడుకులు అనంత్‌, ఆకాశ్‌, కోడ‌ళ్లు రాధికా, శ్లోకా వెల్‌క‌మ్ ప‌లికారు. వారి ఇంట్లోని పూజా మందిరంలో రిహ‌న్నాతో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.

Leave a Reply