అనారోగ్యంతో ఉన్న జనసేన మాజీ కార్పొరేటర్‌కు బుద్ధా వెంకన్న పరామర్శ

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ 48వ డివిజన్‌కు చెందిన జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్ అత్తులూరి పెదబాబు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా పెదబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బుద్ధా వెంకన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయం అందిస్తామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ మండలి రాజేష్, మహాదేవ్ అప్పాజీ, మారుపిళ్ల రాజేష్, మైలవరపు దుర్గారావు, అజయ్ వర్మ, రామకృష్ణతో పాటు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.