Monsoon| ఈ ఏడాది మంచి వర్షపాతం

విశాఖ | రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ఈసారి విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఎండలు మండిపోయే మే నెలలో ఈసారి భారీ వర్షాలు కురిసి వాన కాలం వచ్చేసిందా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.రెండు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురిసింది. అటు కర్ణాటకలో కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు.

రైతులకు ఇది భారీ శుభవార్త అనే చెప్పవచ్చు. పైగా 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలు..అన్నదాతలకు వాతావరణ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. ఎందుకంటే ఈసారి రుతుపవనాలు త్వరగా వచ్చేసాయి.. రుతుపవనాలు కేరళకు అనుకున్న సమయానికి వారం ముందే రుతుపవనాలు పలకరించాయి . . దాదాపు 16 ఏళ్ల తర్వాత రుతుపవనాలు త్వరగా రావడం మళ్లీ ఇప్పుడే.

చివరిసారిగా 2009, 2001లో రుతుపవనాలు కేరళను త్వరగా పలకరించాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ ఏడాది త్వరగా పలకరించాయి .

ప్రతి ఏటా జూన్ 1 లేదా తొలివారంలో రుతుపవనాలు కేరళను పలకరిస్తాయి. ఆ తర్వాత అవి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా సుమారు 107 ఏళ్ల క్రితం అనగా.. 1918లో, మే 11న రుతుపవనాలు కేరళను పలకరించాయి. ఇంత తొందరగా కేరళను రుతుపవనాలు పలకరించిన సంవత్సరం ఇదే. మళ్లీ ఎప్పుడు ఈ సీన్ రిపీట్ కాలేదు.అయితే 2001, 2009లో మాత్రం సాధరణానికి భిన్నంగా వారం రోజుల ముందుగానే అంటే మే 24, 25 తేదీల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. మళ్లీ ఈ ఏడాది ఇదే సీన్ రిపీట్ అయింది

కేరళలో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించిన రికార్డు 1972లో నమోదైంది, ఆ సమయంలో జూన్ 18న రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అనగా 2025లో గతేడాదితో పోలిస్తే.. ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే పలకరించడం అన్నదాతలకు కలిసి వచ్చే అంశం అంటున్నారు.

Leave a Reply