- యువతిని కాపాడిన సిబ్బందిని అభినందించిన హైడ్రా కమిషనర్
హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ సూచించారు. ప్రమాదం ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో డిఆర్ఎఫ్ బృందాల అప్రమత్తతతో కొంతవరకు నష్టాన్ని తగ్గించగలదని ఆయన అన్నారు.
మంగళవారం హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతిని రక్షించినందుకు హైడ్రా డిఆర్‌ఎఫ్ సిబ్బంది మార్షల్ ఫక్రుద్దీన్, డిఆర్‌ఎఫ్ సహాయక సిబ్బంది ఎ. రమేష్, ఎన్. శ్రీనివాస్, ఎండి ఇమాముద్దీన్, కె. కార్తీక్ కుమార్‌లను కమిషనర్ ఎవి రంగనాథ్ అభినందించారు.
సాగర్‌లోకి దిగడానికి కూడా వీలుకాని ప్రదేశంలో ఆ యువతిని తాళ్ల సహాయంతో సురక్షితంగా రక్షించారని రంగనాథ్ పేర్కొన్నారు. గురువారం కురిసిన భారీ వర్షం కురవగా.. అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించిన డీఆర్‌ఎఫ్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు.