Mogullapally | ముగిసిన సీఎం కప్ క్లస్టర్ క్రీడాపోటిలు

Mogullapally | మొగుళ్ళపల్లి, ఆంధ్రప్రభ : మొగుళ్ళపల్లి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఆవరణలో ఈ రోజు సీఎం కప్ 2026 క్లస్టర్ లెవెల్ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. మొగుళ్ళపల్లి క్లస్టర్లు క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా తహసిల్దార్ సునీత, ఎంపీడీఓ సూపర్డెంట్ సత్యనారాయణ హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న సీఎం కప్ 2026 పాల్గొనే క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించి మండల స్థాయికి సెలెక్ట్ కావాలని, ఆటల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు వివిధ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉందని మంచి ప్రతిభ కనబరిచి మీ ఊరికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాగ్యశ్రీ , వెంకన్న, సురేందర్, కుమారస్వామి, ప్రవీణ్, పద్మా, కళ్యాణి, లలిత, విజయభాస్కర్, మండల సీనియర్ పీడీ రాజయ్య, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply