narendra modi|పెద్దన్నొచ్చాడు.. హైదరాబాద్‌కు ప్రధాని రాక
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు పీఎం నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు తెలంగాణ గవర్నర్ శిప్రతాప్ శుక్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మోదీ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బేగంపేట నుంచి నరేంద్ర మోదీ నేరుగా హెచ్ఐసీసీ వెళ్లనున్నారు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దపీట వేశారు. సుమారు రూ.9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రోడ్‌షో అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగిస్తారు.
