MLA | మాజీ స‌ర్పంచ్ స‌స్పెండ్‌…

MLA | మాజీ స‌ర్పంచ్ స‌స్పెండ్‌…

MLA | నర్సంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్న నర్సంపేట మాజీ సర్పంచ్ చిలువేరు రజనీభారతిని సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ ఈ రోజు పేర్కొన్నారు. రజనీ భారతితో పాటు జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి తక్కళ్లపెల్లి ఉమాలను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించినట్లు చెప్పారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్(Battini Rajender) మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నర్సంపేట మాజీ సర్పంచ్ చిలువేరు రజినీ భారతి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ వార్డు సభ్యులు తక్కళ్లపెల్లి ఉమాలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhav Reddy) ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి నేడు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. నేటి నుండి వీరికి కాంగ్రెస్ పార్టీతో గాని, పార్టీ కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply