టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే ఓదార్పు

రేణిగుంట , ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ కుమార్ ను శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఓదార్చారు. మండలంలోని మల్లవరం గ్రామపంచాయతీ సుబ్బయ్యగుంట గ్రామానికి చెందిన ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ కుమార్ సతీమణి చిత్ర రెడ్డి ఇటీవల మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సుబ్బయ్యగుంట గ్రామంలోని కిరణ్ కుమార్ నివాసానికి చేరుకొని ఆయన సతీమణి చిత్ర చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కిరణ్ కుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ముని చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, పిడికిటి మునస్వామి నాయుడు, అత్తూరు హరి రెడ్డి, అత్తూరు ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
