ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఓపిక భలే
ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఓపిక భలే
- అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తన స్నేహం సన్నితాన్ని చాటి చెబుతూ గంటల తరబడి ఓపికగా కూర్చుని బలే అనిపించుకున్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ కరీం సతీమణి గుండెపోటుతో మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీముఖ్య సమావేశంలో పాల్గొని హుటాహుటిన రాత్రి పదిన్నర గంటలకు సీనియర్ జర్నలిస్ట్ కరీం నివాసానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే సీనియర్ జర్నలిస్టు కరీం తో సతీమణి మూర్తి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు పరామర్శించారు. సీనియర్ జనరల్ సతీమణి అంత్యక్రియలు అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతాయని తెలియడంతో ఆయనతో ఏళ్ల తరబడి ఎమ్మెల్యే కున్న సన్నిహిత బంధం తో అంత్యక్రియలు అయ్యేవరకు గంటల తరబడి రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల వరకు జరిగిన అంత్య క్రియల్లో పాల్గొని సాంప్రదాయ నివాళులర్పించారు.
ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఏ ప్రజా ప్రతినిధి కూడా స్నేహితుల కోసం సన్నిహితంగా రాత్రంతా ఓపికగా ఉండడం స్నేహానికి సన్నిహితానికి గల ప్రాముఖ్యతను ఎమ్మెల్యే నిరూపించారు. సీనియర్ కరీం కుమారులు సౌదీ నుండి రావడానికి ఆలస్యం జరిగాయి. అంత్యక్రియ లలో అదిలాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఏక్బాల్, సివిల్ ఏ వన్ కాంట్రాక్టర్ ముంతాజ్ బీయ బాని, జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ షేక్ అహ్మద్, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ అశ్రద్ బేగం అన్సారి, బైంసా డిప్యూటీ తాసిల్దార్ బాపూరావు, ఉట్నూర్ మాజీ వైసీపీ సలీమోద్దీన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బిరుదుల లాజర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాస0డ్ల ప్రభాకర్ అరికిళ్ల అశోక్, జావిద్ అన్సారి, స్వామి, మైనార్టీ నాయకులు వివిధ పార్టీల నాయకులు బంధువులు పాల్గొన్నారు.
