2వ బ్యాచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ…

2వ బ్యాచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ…
వాంకిడి, ఆంద్ర ప్రభ : మండలంలోని గ్రామ పంచాయతీలకు చెందిన రెండవ బ్యాచ్ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి ఖాజా అజాజుద్దీన్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో వార్డు సభ్యుల పాత్రను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో, గ్రామ సభలను సక్రమంగా నిర్వహించడంలో గ్రామ స్థాయి సమస్యలను పరిష్కరించడంలో వార్డు సభ్యులు చురుకుగా పనిచేయాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 9వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు వాంకిడి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరం లొ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో శిక్షకులు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
