నందికొట్కూర్‌లో ఎస్సై చంద్రశేఖర్ తీవ్ర హెచ్చరిక
నందికొట్కూర్‌లో ఎస్సై చంద్రశేఖర్ తీవ్ర హెచ్చరిక
వేసవి సెలవులు పిల్లల ప్రాణాలతో చెలగాటం కాదు!
మైనర్లకు వాహనం ఇస్తే జైలు భారీ జరిమానా తప్పదు
నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూర్, ఆంధ్రప్రభ : వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తతోపాటు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నందికొట్కూరు పట్టణంలో వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్సై చంద్రశేఖర్ మాట్లాడుతూ… సరదా పేరుతో మైనర్లు బైక్ నడిపితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని తెలిపారు మైనర్లకు వాహనం ఇవ్వడం చట్టరీత్యా నేరం పట్టుబడితే తల్లిదండ్రులు వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.మరి ముఖ్యముగా పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వారికి వాహనం ఇచ్చి వారి జీవితం నాశనం చేయొద్దు. అని సూచించారు.
రాంగ్ రూట్ ప్రయాణం ప్రాణాంతకం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు అని తెలిపారు మితిమీరిన వేగం తగ్గించండి, ప్రాణం నిలబెట్టుకోండి అని అన్నారు. హెల్మెట్ లేకుండా ఒక్క అడుగు కూడా వేయొద్దు హెల్మెట్ ప్రాణరక్షక కవచం అని తెలిపారు తల్లిదండ్రులకు పోలీసు వారు తెలిపే ముఖ్య సూచనలు వేసవి సెలవుల్లో పిల్లలపై పూర్తి బాధ్యత మీదే. ఒక్క నిర్లక్ష్యం జీవితాన్ని నాశనం చేస్తుంది అని అన్నారు. మైనర్లు సరదా కోసం ద్విచక్ర లేదా ఇతర వాహనాలు నడిపితే ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు.
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి వాహనాలు ఇవ్వొద్దని ఎస్సై చంద్రశేఖర్ సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎట్టిపరిస్థితుల్లో రాంగ్‌రూట్‌లో ప్రయాణించవద్దని, మితిమీరిన వేగంతో వాహనాలను నడపవద్దని ఆయన స్పష్టం చేశారు.
సొంత వాహనాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ముందుగా టైర్లు, బ్రేకులు, ఇంజన్ కండిషన్‌ను తనిఖీ చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు పగటిపూట ప్రయాణంచేసి, రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
