దుండిగల్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

దుండిగల్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
దుండిగల్, ఆంధ్ర ప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దుండిగల్ సర్కిల్-59 కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణి కరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (AMC) లక్ష్మయ్య, (ACP) శ్రీనివాస్, డిప్యూటీ ఇంజనీర్లు, అన్వేష్ రెడ్డి, పాపమ్మ, అసిస్టెంట్ ఇంజనీర్లు సురేందర్ నాయక్, అశోక్ కుమార్, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


