నిజామాబాద్ ప్రతినిధి, మార్చి12 (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.
ఈనెల 3న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేయగా, ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్ ఘటన మరవకముందే… బుధవారం ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ దాడులు జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు వెల్లడించనున్నారు.