Minister | గుత్తి కోయలకు దుప్పట్లు పంపిణీ…
Minister | గుత్తి కోయలకు దుప్పట్లు పంపిణీ…
Minister | తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలం కామారం గ్రామపంచాయతీ పరిధిలోని గుత్తికోయ గూడెంలో గొత్తి కోయిలకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ.. మంత్రి సీతక్క(Minister Seetakka) ఆదేశాలతో గుత్తి కోయిలకు చలికాలంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి దుప్పట్లను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్ర ప్రజలందరి(people of the state)కీ న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారం సర్పంచ్ కొర్నిబెల్లి సావిత్రి ఉపసర్పంచ్ రేగా అనిల్, రేగా ఆనంద్, గుత్తి కోయలు పాల్గొన్నారు.
