Satyasai | శతజయంతి..

Satyasai | శతజయంతి..

Satyasai, మక్తల్, ఆంధ్రప్రభ : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా (Satya saibaba) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం వాకింగ్ రేస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో డాక్టర్ పి.శ్రీరామ్ ప్రథమ బహుమతి విజేతగా నిలిచారు. అదే విధంగా శ్రీధర్ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వితీయ స్థానంలో నిలువగా, పూజ సామాగ్రి స్టోర్ నిర్వాహకులు రేణుక నర్సింహా తృతీయ స్థానంలో నిలిచారు. నడక పోటీ విజేతలకు సత్యసాయి సేవ సమితి సభ్యులు అభినందించారు.

సత్యసాయి బాబా జయంతి (Satyasaibaba Jayanthi) రోజున సత్యసాయి మందిరంలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు సత్యసాయి సేవా సమితి సభ్యులు ప్రకటించారు. విద్యార్థులకు కూడా వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు సత్య సాయి సేవ సమితి సభ్యులు తెలిపారు.

Leave a Reply