పెద్ద కౌకుంట్లలో మెగా వైద్య శిబిరం

పెద్ద కౌకుంట్లలో మెగా వైద్య శిబిరం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద కౌకుంట్ల గ్రామంలో పయ్యావుల ఓబులమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం వారి కుమారులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో 1,209 మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందించి, అవసరమైన మెడికల్ టెస్టులు, ఆరోగ్య సలహాలను డాక్టర్లు అందించారు.
ఈ కార్యక్రమంలో పయ్యావుల శ్రీనివాసులు, వారి కుటుంబ సభ్యులు, పెద్దఎత్తున, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మెగా వైద్య శిబిరంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు పయ్యావుల సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో గైనిక్ పరీక్ష 218 మంది, జనరల్ పరీక్షలు 302 మంది, ఆర్తో పరీక్షలు 261 మందికి, పల్మనాలజీ పరీక్షలు 86 మందికి, కార్డియక్ పరీక్షలు 274 మందికి, డెర్మటాలజీ పరీక్షలు 68 మందికి నిర్వహించారు. ఇందులో ఈసీజీ 274 మందికి, 2డి ఎకో 274 మందికి, యుఎస్జి 32 మందికి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గంగాధర్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్లు లక్ష్మీనారాయణ, వెంకటరమణ, యుగంధర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.విష్ణు, స్పెషలిస్టులు డా.కిరణ్ కుమార్ రెడ్డి, డా.మనోజ్ కుమార్, డా.ఉష, డా.సుస్మిత, డా.సాహిత, డా.నిఖిల, డా.గణేష్, కౌకుంట్ల మెడికల్ ఆఫీసర్ డా.చందన, ఆర్గనైజర్ సురేష్, మాధవ్, డాక్టర్లు మరియు ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
