విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
పాఠశాల వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన సర్పంచ్
ఊట్కూర్, ఆంధ్రప్రభ: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని కొత్తపల్లి సర్పంచ్ నర్సిములు అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి పాఠశాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన నాణ్యత, తాగునీటి సౌకర్యం, తరగతి గదుల పరిస్థితి, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
చదువుతో పాటు విద్యార్థులను వివిధ రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివశంకర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
