కూటమి ప్రభుత్వ విజయాలపై ఇంటింటి ప్రచారం
- మంత్రి గొట్టిపాటి రవికుమార్
సంతమాగులూరు, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

