Megastar | మరోసారి టాలీవుడ్‌లో హాట్ డిస్కషన్..

Megastar | మరోసారి టాలీవుడ్‌లో హాట్ డిస్కషన్..
Megastar | వీఎఫ్‌ఎక్స్ పనుల వల్ల పెరుగుతున్న ఆలస్యం
ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఆందోళన
మేకర్స్ మౌనం వెనుక అసలు కారణం ఏమిటి?
భారీ అంచనాల మధ్య “విశ్వంభర”
హాలీవుడ్ స్థాయి విజువల్స్‌పై ఫోకస్
Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ భారీ, క్రేజీ మూవీ గురించి మరోసారి టాలీవుడ్‌లో హాట్ డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ మారిన ఈ సినిమా ఇప్పుడు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానుల్లో అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా? లేదా..? అసలు తెర వెనుక ఏం జరుగుతుంది అనే సందేహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.? అసలు ఏం జరుగుతుంది..? ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది..?
Megastar | వీఎఫ్‌ఎక్స్ పనులే ప్రధాన కారణమా?
భారీ స్థాయిలో ఫాంటసీ విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా కీలకంగా మారిందని తెలుస్తోంది. మేకర్స్ మొదట అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయి విజువల్ అవుట్‌పుట్ ఇవ్వాలనే లక్ష్యంతో టీమ్ పని చేస్తోందట. అందుకే రిలీజ్ విషయంలో తొందరపడటం లేదని.. లేట్ అయినా లేటెస్ట్ గా రావాలనే ఉద్దేశ్యంతోనే ఇంత టైమ్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

Megastar | ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఆందోళన
“విశ్వంభర” అనౌన్స్ అయినప్పటి నుంచి మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. వరుసగా రిలీజ్ డేట్లు మారుతుండటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా నుంచి సరైన అప్డేట్స్ కూడా లేకపోవడంతో రూమర్స్ మరింత పెరుగుతున్నాయి. ఎప్పుడో విడుదల కావాలి. కానీ.. కాలేదు. ఈ సమ్మర్ లో రిలీజ్ చేస్తామన్నారు కానీ.. అది జరగలేదు. జులైలో వస్తుందని ప్రచారం జరిగింది. ఆతర్వాత ఆగష్టు అని టాక్ వినిపిస్తోంది కానీ.. క్లారిటీ లేదు. ఈ మూవీ గురించి మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Megastar | మేకర్స్ మౌనం వెనుక ఏముంది?
ఇప్పటి వరకు చిత్రబృందం అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీంతో ఈ ఏడాదిలోనే సినిమా విడుదల అవుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అన్న చర్చ కొనసాగుతోంది. అయితే.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మేకర్స్ మాత్రం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గ్రాండ్‌గా తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నారట. అయితే.. ఎప్పుడు ఈ సినిమా వస్తుందో ఇంత వరుకు క్లారిటీ లేదు.

Megastar | భారీ అంచనాల మధ్య “విశ్వంభర”
సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ సెట్స్, విజువల్ వండర్స్, ఎమోషనల్ డ్రామా ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయని టాక్. మెగాస్టార్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా “విశ్వంభర” నిలుస్తుందా? లేక ఆలస్యాల వల్ల హైప్ తగ్గిపోతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిరంజీవి మాత్రం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్పారట. అందుకనే.. మేకర్స్ విజువల్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఉండేలా కేర్ తీసుకుంటున్నారనేది ఇన్ సైడ్ న్యూస్. మరి.. త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
CLICK HERE TO READ Petition | అశ్లీల, ఏఐ కంటెంట్ తొలగించాలని ఆదేశాలు
