Megastar | చిరు చిత్రంపై సీఎం రేవంత్‌ ప్ర‌శంస‌లు..

Megastar | చిరు చిత్రంపై సీఎం రేవంత్‌ ప్ర‌శంస‌లు..

  • “మన శంకర వర ప్రసాద్ గారు”
  • కుటుంబ స‌భ్యుల‌తో తిల‌కించిన‌ట్లు తెలిపిన ముఖ్య‌మంత్రి
  • ఓ వేదిక‌లో క‌లుసుకున్న చిరంజీవి, సీఎం రేవంత్

Megastar | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి ఓ సమ్మిట్‌లో క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్ద‌రూ మాట్లాడుకున్నారు. “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రాన్ని తన కుటుంబంతో పాటు మనవళ్లతో కలిసి చూశామ‌ని చిరంజీవితో సీఎం అన్నారు. ఆ సినిమా ఎంతో వినోదభరితంగా ఉందని ప్రశంసిస్తూ, చిరంజీవిపై తన అభిమానాన్ని వ్యక్తిగతంగా తెలియజేశారు. అనంత‌రం చిరంజీవికి (Chiranjeevi) అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక వేదిక అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2026 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొని రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కీలక అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉండగా, మెగాస్టార్ చిరంజీవి జ్యూరిచ్‌లో ఉన్న విషయం ఆయనకు తెలిసింది. వెంటనే మెగాస్టార్‌ను దావోస్ సమ్మిట్‌కు ఆహ్వానించగా, ఆ ఆహ్వానాన్ని గౌరవంగా స్వీకరించిన చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు.

CLICK HERE TO READ పట్టాలెక్కేది ఎప్పుడు..?

CLICK HERE TO READ MORE

Leave a Reply