కార్పొరేట్ కు ధీటుగా గురుకుల విద్యార్థులు

కార్పొరేట్ కు ధీటుగా గురుకుల విద్యార్థులు
రాప్తాడు, ఆంధ్రప్రభ: కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు రాణిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి మండలం నసనకోట సమీపంలోని ఎం.జె.పి బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని హార్షం వ్యక్తం చేశారు.
ఇందులో టాప్-4 విద్యార్థినులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. అనంతపురంలోని టిడిపి క్యాంప్ కార్యాలయంలో విద్యార్థినులకు శాలువాలతో సన్మానించి నగదు బహుమతిని అందజేశారు. ఉపాధ్యాయులను విద్యార్థినుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించి మొమెంటోలు అందించారు. ప్రతిభా పురస్కారాలు అందుకున్న వారిలో కనగానపల్లికి చెందిన గరుగు అక్షయ 581 మార్కులు మన్నీల గ్రామానికి చెందిన వహీదా 565 మార్కులు బెలుగుప్ప మండలం తగ్గుపర్తికి చెందిన గ్రీష్మ 581 మార్కులు కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామానికి చెందిన జాహ్నవి 577 మార్కులు సాధించారు.
ప్రతి ఏటా నసనకోట ఎంజేపి విద్యార్థినులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. ఈ ఏడాది మరింత మంచి మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు.ఇందులో విద్యార్థుల కృషి పట్టుదలతో పాటు ఉపాధ్యాయుల కష్టం కూడా ఉందన్నారు.ఈ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ కు ఏమాత్రం తగ్గకుండా మార్కులు సాధిస్తున్నారని అన్నారు.
